గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురైన విషయం తెలిసిందే.. ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించేందుకు గుంటూరు వచ్చారు. ఈ నేపధ్యంలో గుంటూరు లోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఈ నేపధ్యంలో వైసీపీ శ్రేణులు అక్కడకి చేరుకోవడంతో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ నేపద్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


































