Breaking: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఈయనను మెరుగైన చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. కృష్ణ గత కొంతకాలంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేటి ఉదయం ఈయనకు ఈ సమస్య మరింత తీవ్రం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు తననీ మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఈ విధంగా కాంటినెంటల్ హాస్పిటల్లో కృష్ణ చేరడంతో వైద్యులు తనకు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు.ప్రస్తుతం ఈయన ఆరోగ్య విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు తెలియడంతో ఎంతో మంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తన ఆరోగ్యం స్థిమితంగా ఉండాలని తన క్షేమంగా బయటకు రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Breaking
ఇక గత కొద్ది రోజుల క్రితం కృష్ణ తన సతీమణి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే తన భార్య మరణించడంతో కృష్ణ ఎంతగానో కుమిలిపోయారని తద్వారా ఈయన కూడా అనారోగ్య సమస్యలకు గురయ్యారని తెలుస్తోంది.ఈయన ఆరోగ్య పరిస్థితి తీవ్రతరం కావడంతో హాస్పిటల్ కి తరలించారు.































