Marriage: పెళ్లి అంటే.. ఎంతో మంది బంధువుల మధ్య.. వేల మంత్రోచ్ఛారణల మధ్య జరుగుతుంది. పెళ్లి పీటల మీదకు రావాలంటే.. ఒకప్పుడు పెళ్లి కూతురు సిగ్గు పడుకుంటూ వచ్చేది. అలా పెళ్లిపీటల మీదకు పెళ్లి.. వధువు తల వంచుకొని.. తాళి కట్టించుకునేవారు.

కానీ కాలం మరుతోది. పరిస్థితులు, అలవాట్లు మారుతున్నాయి. ట్రెండ్ మారుతూ వస్తుండటంతో.. పెళ్లి హడావుడి అనేది ప్రస్తుతం వధువు చేతుల్లోనే ఉంటుంది. ఇలా వాళ్ల పెళ్లి కలకాలం గుర్తుండిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి ఎలా జరగాలనే దాని గురించి నిర్ణయించుకుంటున్నారు.

పెళ్లిలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా.. వధువులే దగ్గర నుంచి చూసుకోవడం విశేషం. సంగీత్ లు.. మెహెందీలు.. ఫంక్షన్లు ఇలా పెళ్లిల్లో డ్యాన్సులతో ఫుల్ హంగామా చేసేస్తున్నారు. ఇక తాజాగా జరిగిన ఓ ఘటనలో ఓ యువతి తన పెళ్లిని కొత్తగా ప్లాన్ చేసుకుంది.
వరుడికి ప్రపోజ్ చేయడంతో అతడు..
ఢిల్లీలోని గుర్గావ్ కు చెందిన సబాకపూర్ అనే యువతి పెళ్లి జరుగుతోంది. ఆమె మండపం వద్దకు వెళ్లే సమయంలో ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తుండటం మనం గమనించవచ్చు. కత్రినా కైఫ్, సిద్ధార్త్ మల్హోత్రా కలిసి నటించిన బార్‌బార్ దేఖో సినిమాలోని సా ఆస్‌మానోకో అనే పాటకు ఎనర్జిటిక్ స్టెప్పులతో గ్రే కలర్ లెహంగా ధరించి అదరగొట్టింది. అది చూపరులను ఎంతగానో అలరించింది కూడా. ఇలా డ్యాన్స్ వేస్తూ.. పెళ్లి కొడుకు దగ్గరకు వెళ్లి.. అతడిముందు మోకరిల్లి రింగు తొడిగింది. సినిమా రేంజ్ లో ఆమె ఇలా డ్యాన్స్ వేస్తూ.. వరుడికి ప్రపోజ్ చేయడంతో అతడు ఫిదా అయిపోయడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. ఇలాంటి పెళ్లి కూతురు దొరకడం అతడి అదృష్టమని నెటిజన్లు ప్రశంసలతో మంచెత్తారు.






























