Crime News: సొంత మనుషులే వావీ వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. సంబంధాలుకు విలువనీయడం కామాంధులు. సమాజం ఏం అనుకుంటుంది, చట్టం శిక్షిస్తుందనే భయాలు లేకుండా బరితెగిస్తున్నారు. అత్యాచారాలను ఆపేందుకు ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా… కామాంధులు భయపడటం లేదు.

రోజుకో అత్యాచార ఘటన బయటకు వస్తూనే ఉంది. దేశంలో నిర్భయ, దిశ, ఫోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చినా… కామాంధులకు భయం కలగడం లేదు. తాజాగా సొంత వదినపైనే అత్యాచారాని పాల్పడ్డాడో కామాంధుడు. హైదరాబాద్ కుషాయిగూడలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంపూర్ణ అనే మహిళ తన ఏడాదిన్నర చిన్నారితో పాటు మరో మహిళతో కలిసి నివాసం ఉంటోంది.

అయితే రాత్రి నిద్రిస్తున్న సమయంలో పీకల దాకా తాగి వచ్చిన మరిది వేణగోపాల్.. తనతో పాటు 10 మంది రౌడీలను తీసుకువచ్చి.. సంపూర్ణ నివాసం ఉంటున్న ఇంటి తలుపులు బద్దలు కొట్టాడు. వదినను దుర్బాషలాడుతూ.. దారుణంగా దాడి చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు..
వదిన అని మరిచి లౌంగిక దాడికి పాల్పడ్డాడు. ఈసమయంలో బాధితులు భయంగా అరవగా.. చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. నిందితుడు దాడికి తెగబడటంతో మహిళలు అరవడంతో పాటు చిన్న పిల్ల ఏడుపు విని అక్కడికి చేరుకున్న స్థానికులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా… తప్పించుకున్నారు. ఈక్రమంలో నిందితుడు వేణుగోపాల్ తన బైక్ ను అక్కడే వదిలి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫిర్యాదును నమోదు చేసుకుని… నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.



























