బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్ తగిలింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే.. ఆర్టీసీ బస్ పాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు బస్ భవన్ ను ముట్టడించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం కవితను చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రాజకీయ వర్గాల్లో ఈ అరెస్టు హాట్ టాపిక్ గా మారింది.
































