Manchu Vishnu: మంచు విష్ణు సినీనటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈయన మా అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. మంచు విష్ణు మా అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కువగా మా సభ్యుల ఆరోగ్యం గురించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మా సభ్యులకు ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ లో మా సభ్యులందరూ ఉచితంగా చెకప్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ సేవలను కొనియాడారు. ఇకపోతే మా బిల్డింగ్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు.

ఇప్పటివరకు మా అసోసియేషన్ కు బిల్డింగ్ లేదు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో మంచు విష్ణు మా బిల్డింగ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా తన సొంత డబ్బులతో మా బిల్డింగ్ నిర్మిస్తానని చెప్పినప్పటికీ ఇప్పటివరకు మా బిల్డింగ్ ఏ మాత్రం కార్యరూపం దాల్చలేదు.తాజాగా మా బిల్లింగ్ గురించి మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు.
అందరి నిర్ణయం అవసరం…
మరో ఆరు నెలలు మా బిల్డింగ్ పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంచు విష్ణు తెలిపారు.తాను అధ్యక్షుడిగా ఎన్నికైన ఆరు నెలలలో 75 శాతం తన మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను పూర్తి చేశానని మరోఆరునెలలు మా బిల్డింగ్ పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంటుందని వెల్లడించారు. ఇక ఈ సమావేశంలో భాగంగా సినిమా టికెట్ల రేట్లు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. సినిమా టికెట్ల రేట్లు ఒక్కరే తీసుకోవలసిన నిర్ణయం కాదు. ఈ విషయంపై అందరూ కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని విష్ణు వెల్లడించారు.

































