మెగా ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్న బన్నీ ఫ్యాన్స్.. చెప్పండ్రా ఇప్పుడు ఎవరు బెస్ట్ అంటూ?

0
39
Allu Arjun - Ram Charan : ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య వార్ జరగడం అనేది మామూలు విషయమని చెప్పాలి. నిజానికి ఆ హీరోలు కలిసి బాగానే ఉన్నప్పటికీ కూడా అభిమానులు మాత్రం వారి మధ్య గ్యాప్ సృష్టించి బాగా వార్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పటికీ ఎంతోమంది స్టార్ హీరోలు అభిమానుల నుండి ఇటువంటి రచ్చ ఎదుర్కున్నారు. అయితే తాజాగా మెగా ఫ్యాన్స్, బన్నీ ఫాన్స్ మధ్య కూడా మాటల యుద్ధం ఒక రేంజ్ లో నడుస్తుందని చెప్పాలి.

మామూలుగా అల్లు అర్జున్ కు మెగా హీరో అనే ట్యాగ్ ఉందని చెప్పాలి. కానీ మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు అల్లు అర్జున్ అంటే ఇష్టపడేవాళ్ళు సపరేటుగా బన్నీ పేరుతో ఒక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే మెగా వర్సెస్ బన్నీ అనే ఉద్దేశంతో ఉంటారు. దీంతో ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీని వెనకేయాలని.. బన్నీని పైకెత్తాలని చూస్తూ ఉంటారు.

చెప్పాలంటే అభిమానులు ఒకరికొకర ఫైట్ చేస్తూ ఉన్నా కూడా అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలీతో బాగా క్లోజ్ గా ఉంటాడు. అయితే రామ్ చరణ్ అభిమానులు కూడా బన్నీ విషయంలో బాగా పోటీ చూపిస్తూ ఉంటారు. ఇద్దరిలో రామ్ చరణ్ గొప్ప అంటూ ఆయనను పొగుడుతూ ఉంటారు. కానీ ఇంత కాలానికి బన్నీ ఫ్యాన్స్ కు తిరిగి వాళ్లకు ఎదురుపడే సమాధానం దొరకటంతో అస్సలు ఆగట్లేరు.. చెప్పాలంటే తగ్గట్లేదు.

Allu Arjun – Ram Charan :

అసలు కారణమేంటంటే రీసెంట్గా.. అల్లు అర్జున్ 69 వ జాతీయ అవార్డు విన్నింగ్ లిస్టులో ఉత్తమ నటుడుగా అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో టాలీవుడ్ లో ఫస్ట్ టైం ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డు అందుకోవటంతో ఆయన అభిమానులు ఒక రేంజ్ లో ఆయనను పొగిడేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా అవార్డు రాగా అక్కడ రామ్ చరణ్ నటనకు మాత్రం రాలేదు. కేవలం పాట కోసమే అవార్డు అందింది. దీంతో కావాలని బన్నీ ఫాన్స్ చరణ్ ఫాన్స్ ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి రియల్ హీరో ఎవరు అంటూ బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో దాడికి దిగుతున్నారు.