Allu Arjun: పుష్ప ఈ సినిమా గురించి దేశంలో తెలియన వారుండరంటే.. అతిశయోక్తి కాదు. ఆ రేంజ్ లో హిట్ కొట్టింది సినిమా. దీంతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. బన్నీ కెరీర్ ను పుష్పకు ముందు పుష్ప తరువాత అన్న రేంజ్ కు తీసుకెళ్లింది.

ఏకంగా రూ.300 కోట్లు కొల్లగొట్టింది. అంతకుముందు టాలీవుడ్, కేరళలోనే ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీ … పుష్ప సినిమాతో ఇండియా వైడ్ ఫేమస్ అయ్యాడు. ఏకంగా కొంత మంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా బన్నీతో నటించేందుకు ఉవ్విల్లూరుతున్నారు.

దేశాన్నే కాకుండా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పుష్ప మేనియా కొనసాగుతోంది. ‘తగ్గదే లే’ డైలాగ్ అందరికి ఊత పదంగా మారింది. క్రికెటర్ల దగ్గర నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు రీల్స్ చేస్తూ తెగ హడావుడి చేస్తున్నారు. మరోవైపు శ్రీ వల్లీ పాట కూడా సంచలనంగా మారింది. ఇటీివల డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, కోహ్లీ, ఇషాంత్ కిషన్ వంటి క్రికెటర్లు పుష్ప డైలాగులు, శ్రీవల్లి స్టెప్పులతో అదరగొట్టారు.
హోమాలు చేయాలని ప్రముఖ ..
పుష్ప సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు బన్నీ. అల్లు అర్జున్‌కు భవిష్యత్తులో కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా సక్సెస్‌లు రావాలంటే ఆయన కొన్ని ప్రత్యేక పూజలు, హోమాలు చేయాలని ప్రముఖ జ్యోతీష్య పండితులు సూచిస్తున్నారట. ఇటీవల పుష్ప 2 షూటింగ్ సందర్భంగా కొంతమంది ఫేమస్ జ్యతిష్యూలకు బన్నీ జాతకం చూపించారని తెలుస్తోంది. ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా పూజలు చేయాలని సూచించారట.































