Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలను పొందారు. అల్లు ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందిన విషయం మనకు తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ మరింత గుర్తింపు పొందారు.

ఇదిలా ఉండగా తాజాగా బన్నీ వాసు అల్లు అర్జున్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. లావణ్య విరాన్(వంశీ ) జంటగా ముఖ్య గమనిక అనే సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఇటీవల జరిగింది.ఈ కార్యక్రమానికి బన్నీ వాసు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన విరాన్ అల్లు అర్జున్ మధ్య ఉన్నటువంటి బంధం గురించి తెలిపారు.
వంశీ చాలా సంవత్సరాల నుంచి మా దగ్గరే ఉంటున్నారు ఈయన చిన్నప్పటినుంచి గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే పనిచేస్తూ వచ్చారని వంశీ అంటే అల్లు అర్జున్ కు చాలా ఇష్టమని తెలిపారు. ఇక ఎవరైనా ఏదైనా కథ చెప్పడానికి వస్తే ఈరోజు మనతో పాటు ఎవరెవరు కథ వింటున్నారని తెలుసుకుని వంశీని కూడా పిలవండి అంటూ అల్లు అర్జున్ తనని పిలిపించుకొని మరి కథ వినిపిస్తారు.
కథ చెప్పేటప్పుడు వంశీ ఉండాల్సిందే…
వంశీ కథ మొత్తం విన్న తర్వాత తన నిర్ణయాన్ని చాలా సింపుల్ గా చెప్పేస్తారని బన్నీ వాసు తెలిపారు. వంశి అంటే అల్లు అర్జున్ కి చాలా ఇష్టం ఇందాక నేను ఈవెంట్ కి వచ్చే సమయంలో కూడా ఎక్కడున్నావంటూ నాకు ఫోన్ చేశారు ఇలా వంశీ సినిమా ఈవెంట్ కి వెళ్తున్నాను అని చెప్పగా థాంక్యూ మా వంశీని చాలా సపోర్ట్ చేస్తున్నందుకు అంటూ బన్నీ నాతో చెప్పారని వంశి అంటే ఆయనకు అంత ఇష్టం అంటూ బన్నీ వాసు ఈ సందర్భంగా తెలిపారు.
































