వాహనదారులకు బంపర్ ఆఫర్.. బైక్ ధరకే కారు కొనే అవకాశం..?

0
482

సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన చాలామందికి కారు కొనుగోలు చేయాలనే కోరిక ఉంటుంది. అయితే కారు కొనుగోలు చేసే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో తరహా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం కొత్త కారు విలువలో సగం డబ్బులు ఉన్నా సులభంగా కారును కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. దాదాపు కొత్త బైక్ ధరకే సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయవచ్చు.

పలు వెబ్ సైట్ లు తక్కువ ధరకే కార్లను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో తక్కువ ధరకే కారును కొనుగోలు చేయడంతో పాటు ఇతర ప్రయోజనాలు చేకూరనున్నాయి. ట్రూవాల్యూ అనే వెబ్ సైట్ తక్కువ ధరకే కార్లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. తక్కువ బడ్జెట్ లో మంచి కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

బడ్జెట్ కారణంగా కారు కొనాలకునే డ్రీమ్ ను నెరవేర్చుకోలేని వారికి ట్రూ వాల్యూ వెబ్ సైట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. వేర్వేరు కంపెనీలకు చెందిన సెకండ్ హ్యాండ్ కార్లు ట్రూ వాల్యూ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. 65,000 రూపాయలలో కూడా ఈ వెబ్ సైట్ కొత్త కార్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన కార్లకు వారంటీతో పాటు కంపెనీ ఫ్రీ సర్వీస్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.

మనం నివశించే ప్రాంతం, కారు మోడల్, ధరను బట్టి నచ్చిన కారును ఎంపిక చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. 2005 నుంచి గతేడాది వరకు అనేక మోడళ్ల కార్లు ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here