Byreddy shabari: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొంతమంది ఈ సినిమాని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే .ఇటీవల నాగబాబు కూడా ఈ సినిమాపై పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి పోస్ట్ చేయగా మరో టిడిపి ఎంపీ కూడా సెటైరికల్ గా పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు అయితే వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఆమె అల్లు అర్జున్ ని పరోక్షంగా విమర్శలు చేశారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ గారు మీరు నంద్యాలలో ఎన్నికల ప్రచారం చేయటాన్ని ఇప్పటికీ ఇక్కడ ప్రజలు మర్చిపోలేదు. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్ నిర్వహించినట్టుగా మీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నంద్యాలలో చేస్తారని మేము ఆశించాము. నంద్యాలలో మీ సెంటిమెంటు మాకు చాలా బాగా పనిచేస్తుంది మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్ అయింది. మీరు నటించిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఈమె పోస్ట్ చేశారు.

Byreddy shabari: నంద్యాల సెంటిమెంట్..
ఇక అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వచ్చినప్పటికీ తన స్నేహితుడు శిల్పా రవి ఓడిపోయారు. ఈ విషయాన్ని ఈమె గుర్తు చేస్తూ నీ సినిమా వేడుకను కూడా ఇక్కడే నిర్వహించాల్సిందే అంటూ పరోక్షంగా సెటైర్లు వేశారనీ అల్లు అర్జున్ అభిమానులు ఈమెపై భారీగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ వివాదానికి కారణం అవుతుందన్న ఉద్దేశంతోనే ఎంపీ డిలీట్ చేసినప్పటికీ అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



























