దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల నుంచి బయటకు రావడానికి మాస్క్ ఒకటే శ్రీరామరక్ష అని చెప్పవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఎన్95 మాస్కులు ఎంతో సమర్థవంతంగా అడ్డుకుంటాయి.ఈ మాస్కులు ధరించడం వల్ల 95 శాతం వైరస్ నుంచి మనకు రక్షణ కలిగి ఉంటుంది. అయితే ఈ మాస్కులు ధరలు కూడా అధికంగా ఉండడంతో కొందరు ఈ మాస్క్ లను ఉతికి మరియు ఉపయోగిస్తుంటారు.

ఈ విధంగా ఎన్95 మాస్కులు ఒకసారి ఉపయోగించిన తర్వాత తిరిగి వాటిని వాడకూడదు. కొందరు సబ్బులు, షాంపూలు లేదా ఇతర మెడికల్ డిటర్జెంట్ లను ఉపయోగించి ఉతికి తిరిగి ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా ఉతకడం వల్ల మాస్క్ వైరస్ ను అడ్డుకొనే సామర్థ్యం తగ్గిపోతుంది. తద్వారా ఈ మాస్క్ వేసుకునప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు.

నిజానికి ఎన్95 మాస్కులు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. అలాంటిది కొందరు వీటిని ఉతికి ఉపయోగించడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం, రక్షణ ఉండదు. ఎన్95 మాస్కులు లేని వారు మూడు పొరలు కలిగి ఉన్న సాధారణ సర్జికల్ మాస్క్ వాడినప్పటికీ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. గుడ్డ మాస్క్ కన్నా, సర్జికల్ మాస్క్ వైరస్ నుంచి మరింత ఎక్కువ రక్షణ కల్పిస్తుంది.

సర్జికల్ మాస్కు కూడా కేవలం ఒక రోజు మాత్రమే ఉపయోగించాలి. మరుసటి రోజుకు అదే మాస్క్ ఉపయోగించిన ఎలాంటి ఫలితం ఉండదు. సర్జికల్ మాస్క్ ను కూడా ఉతికి ఉపయోగించకూడదు. క్లాత్ మాస్క్ ను తరచూ ఉతికి ఉపయోగించుకోవచ్చనీ నిపుణులు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here