సాధారణంగా కొన్ని విషయాలలో కొంతమంది అనేక సందేహాలు కలుగుతుంటాయి. ఎలాంటి పనులు చేయడానికి ప్రారంభించిన కూడా ఇవి చేయవచ్చా? లేదా? అనే సందేహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే చాలామంది పూజా కార్యక్రమాలలో కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. కొందరు ఇండ్లలో శివలింగాన్ని ఉంచుకోవచ్చని భావిస్తారు. మరి కొందరు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకొని పూజ చేయకూడదని చెబుతుంటారు. అయితే ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించవచ్చా? లేదా? అనే సందేహం చాలామందికి కలుగుతుంది.

మన ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు అని, ఒకవేళ శివలింగాన్ని మన ఇంట్లో పెట్టుకున్నట్లైతే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం నిర్వహించి నైవేద్యాలు సమర్పించాలని భావిస్తారు. ఆ విధంగా చేయకపోతే మన ఇంట్లో ఏవైనా ప్రమాదాలు, సమస్యలు వస్తాయని భావిస్తారు. ఈ విధంగా శివ లింగం గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెబుతుండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే శివలింగం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం….

మన ఇంట్లో శివలింగాన్ని ఉంచుకొని పూజించవచ్చు. అయితే బొటనవేలు సైజులో వున్న శివ లింగాన్ని పూజించడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లోనూ శివలింగాన్ని తప్పకుండా పూజించుకోవచ్చు. శివాలయం లేని ఊరు స్మశానంగా భావిస్తారు కాబట్టి, స్మశానంలో కూడా మనకు శివలింగం దర్శనమిస్తుంది. స్మశానంలోనే శివలింగం దర్శనమిస్తే మన ఇంట్లో ఉండకూడద? కాబట్టి మన ఇంట్లో బొటనవేలు సైజులో ఉన్న శివలింగాన్ని ఉంచుకొని పూజించటం వల్ల మంచే జరుగుతుందనే పండితులు చెబుతున్నారు. అయితే ప్రతిరోజు శివ లింగానికి మంచినీటితో అభిషేకం చేయడం మంచిది. ఒకవేళ చేయడం కుదరక పోయినా పరవాలేదు. ఈ విధంగా ప్రతి రోజు శివలింగానికి అభిషేకం చేయడం వీలు కుదరదు కాబట్టి బొటనవేలు సైజులో ఉన్న శివలింగాన్ని మన ఇంట్లో పెట్టుకోవచ్చు. అదే పెద్ద శివలింగాలు అయితే ప్రతి రోజు క్రమం తప్పకుండా అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించాలి. ఈ శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం లేదా ఓం నమశ్శివాయ అని పలుకుతూ శివుడికి అభిషేకం నిర్వహించాలని పండితులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here