రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఇతడినే చెబుతారు. ఏ మాట మాట్లాడినా.. ఏ పని చేసినా అది పెద్ద విమర్శలకు దారి తీస్తుంది. ఇతడి చుట్టూ.. కాంట్రవర్సీలు అనేవి వైఫైలా తిరుగుతాయి. ఒక వేళ అలా లేదు అంటూ.. అతడే కావాలని స్పష్టించుకుంటాడు. అయితే ఇటీవల ఆర్జీవీ తెలుగు న్యూస్ ఛానళ్లలో పలు ఇంటర్వ్యూలకు పాల్గొంటున్నాడు.

అతే కాకుండా.. ఆడియో ఫంక్షన్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా హాజరవుతున్నాడు. రియాల్టీ షోలో మాత్రం ఆర్జీవీ అస్సలు కనిపించడు. స్పెషల్ ఈవెంట్లను నిర్వహించడంలో టెలివిజన్లలో ఎక్కువగా ఈటీవీ ముందు ఉంటుంది. పండుల సమయంలో… మరేదైనా స్పెషల్ డే ఉందంటే చాలు.. ఆరోజు స్పెషల్ ప్రోగ్రాం ఉండాల్సిందే. అందులో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉంటాడు.
అలా వాళ్లు ప్లాన్ చేస్తుంటారు. అలా ఈటీవీలో కూడా ఈ సారి ఓ ఈవెంట్ పెడుతున్నారు. ఆ షో పేరుఏంటో తెలుసా.. ‘‘పెళ్లాం వద్దు.. పార్టీ ముద్దు’’. అవును మీరు విన్నది నిజమే. ఈ షోకు సంబంధించి టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఎప్పుడూ ఇలాంటి షోలో కనిపించని రామ్ గోపాల్ వర్మ ఈ షో లో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక వర్మ ఉన్నాడంటే.. అక్కడ అమ్మాయిలు ఉండాల్సిందే.. సందడి జరగాల్సిందే. అలాంటిదే ఆ వేదికపై కూడా జరిగింది.
అక్కడ స్టేజీ మీద అమ్మాయిలతో సందడి చేశాడు ఆర్జీవీ. ఆర్జీవీ ఎక్కడా కుదురుగా ఉండడు కదా.. ఎదో ఒక్కటి మాట్లాడటం.. కాంట్రవర్సీలకు లీడ్ ఇవ్వడం చేస్తుంటాడు. అలాంటిదే ఇక్కడ కూడా చేసేశాడు. ‘మీ అందరినీ పెళ్లి చేసుకోవచ్చా?’ అంటూ ప్రపోజ్ కూడా చేశాడు. ఈ ప్రోమో టీజర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. వర్మ అక్కడ కూడా మొదలు పెట్టేశాడుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ షో నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.































