ఇప్పటికే రకరకాల కొత్త వ్యాధులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మరో వింత వ్యాధి జనాలను భయపెడుతుంది .సొంత ఆరోగ్య వ్యవస్థ దీనికి ప్రధాన కారణం అవుతుంది. ఇది మానవ శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షించాల్సిన ఇమ్యూనిటీ వ్యవస్థ ఈ వ్యాధికి కారణమవుతుంది.

ఓట్టావా: కెనడాకు చెందిన 12 ఏళ్ల బాలుని వింత వ్యాధి సోకింది. నాలుక పడుపుపచ్చగా మారడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. సొంత ఇమ్యూన్ వ్యవస్థ ఎర్ర రక్త కణాలపై దాడి చేసి ఈ వ్యాధికి కారణం అవుతుంది. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం అత్యంత అరుదైన కోల్డ్ ఆగ్లుటిన్ అనే వ్యాదితో సదరు బాలుడు బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.
బాలునికి తీవ్రమైన గొంతు నొప్పి, కడుపు నొప్పి, చర్మం పై తేడా రావడంతో ఆసుపత్రికి రావడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు బాలుడు రక్తహీనత, ఏపీసిన్ బార్ వైరస్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థ ఎర్ర రక్త కణాలపై దాడి చేసి విచ్చిన్నం చేయడంతో కామెర్లు, నాలుక పచ్చబడటం కోల్డ్ ఆగిల్టీన్ వ్యాధి ముఖ్య లక్షణము అని యుఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది.
కాగా సదరు బాలుడికి రక్తమార్పిడి చేయడంతో పాటు ఏడు వారాలపాటు రోగనిరోధక వ్యవస్థ కార్యకలాపాలు తగ్గించడానికి స్టెరాయిడ్లు వాడి వ్యాధినిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం బాలుడి నాలుక రంగు సాధారణ స్థితికి చేరుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని మెడికల్ జర్నల్ వెల్లడించింది.



























