Jr NTR: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురిని రానా ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్ వ్యూలో భాగంగా ఎన్టీఆర్ ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం గురించి రానా ప్రశ్నించారు.ఇలా ఎన్టీఆర్ 25 వ తేదీ సాయంత్రం నుంచి బర్త్డే పార్టీలు మొదలవుతాయని 26వ తేదీ పుట్టిన రోజు కావడంతో 25 సాయంత్రం నుంచి పుట్టిన రోజు పార్టీలు జరుగుతాయని తెలిపారు.

27 వ తేదీ చరణ్ పుట్టినరోజు కావడంతో 26వ తేదీ రాత్రికి అలా ఇద్దరం బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తామని వెల్లడించారు. ఇలా మా ఇద్దరి మధ్య ఎప్పటినుంచో మంచి స్నేహం ఉందని తారక్ రామ్ చరణ్ గురించి వెల్లడించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ పొసెసివ్ నేస్ గురించి మాట్లాడారు.
కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే తట్టుకోలేము…
అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. ఈయనకి ప్రతి విషయంలోనూ ఎంతో ఇంటెన్సిటీ ఉంటుందని, చాలా మంచి అనుబంధం ఉంది కానీ ఒకసారి చరణ్ తన కంఫర్ట్ జోన్ ను బ్రేక్ డౌన్ చేశారంటే మనం తన మరొక యాంగిల్ ను భరించలేమని తారక్ వెల్లడించారు. ఇలా వీరిద్దరూ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు






























