ఈ మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మోసాలు చేయడానికి మోసగాళ్లు కొత్తకొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లలోని సమాచారాన్ని దొంగలిస్తూ, ఖాతాలలోని డబ్బులను ఖాళీ చేస్తూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా హ్యకర్లు హైదరాబాద్ లోని సెలబ్రిటీలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడ్డారు. ఎమర్జెన్సీ మెసేజ్ ల పేరుతో సందేశాలు పంపి మోసగాళ్లు ఈ మోసాలకు పాల్పడటం గమనార్హం.

ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్పే వాట్సాప్ కు సైబర్ మోసగాళ్లు కొత్త సవాల్ ని విసిరారు. వాట్సాప్ చాట్ ను హ్యాక్ చేయడంతో వాటాస్ వ్యక్తిగత గోప్యత విషయంలో కొత్త అనుమానాలను రేకెత్తించారు. ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రిటీలను మోసగాళ్లు టార్గెట్ చేయడంతో పోలీసులు సైతం ఈ మోసాలకు పాల్పడుతున్న వారిని సీరియస్ గా తీసుకున్నారు. త్వరలోనే వీరిని పట్టుకుంటామని చెబుతున్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రముఖులకు వారి కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తి వాట్సాప్ నుంచి ఎమర్జెన్సీ మెసేజ్ పేరుతో 6 డిజిట్ కోడ్ తో కూడిన సందేశం పంపారు. ఆ తరువాత వారిని కోడ్ నంబర్ అడుగుతున్నారు. ఎవరైతే కోడ్ నంబర్ చెబుతారో వారి వాట్సాప్ అకౌంట్లు వెంటనే క్రాష్ అయిపోతున్నాయి. దీంతో పోలీసులు వాట్సాప్ యాప్ ద్వారా ఓటీపీ పంపాలని లేదా కోడ్ పంపాలని మెసేజ్ వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సైబర్ నిపుణులు ఎట్టి పరిస్థితుల్లోనూ కోడ్ చెప్పొద్దని కోడ్ చెబితే ప్రమాదంలో పడ్డట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే ఓటీపీ లేదా కోడ్ పంపుతారో వాళ్ల వాట్సాప్ లేదా అకౌంట్లకు సంబంధించిన ఇతర సమాచారం అవతలి వ్యక్తులకు చేరే అవకాశం ఉంది.






























