వలస కూలీలా తరలింపుపై కేంద్ర కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 29, మే 1 న ఇచ్చిన ఆదేశాలపై మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరిని తరలించాలి అనే అంశంపై రాష్ట్రాలకు మరోసారి కీలక మార్గదర్శకాలు ఇచ్చింది కేంద్ర హోమ్ శాఖ. భారీ సంఖ్యలో ప్రజలు రైల్వే స్టేషన్ల కు చేరుకోవడం మరియు సొంత వాహనాలలో ప్రయాణాలు చేయడానికి సిద్ధపడంతో కేంద్రం స్పష్టత ఇచ్చింది.

ఉద్యోగం, పని మీదో, ఇతర పనుల మీదో ఎవరైతే తమ సొంత ఊరు లేదా, పని చేసే స్థలం నుంచి ఇతర రాష్ట్రాలకు, లాక్ డౌన్ విధించడానికి ముందే వెళ్లి చిక్కుకుపోయారో వారిని మాత్రమే తరలించాలని కేంద్ర హోమ్ శాఖ కాలారిటీ ఇచ్చింది. అంతేతప్ప దేశ వ్యాప్తంగా ప్రయాణాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాలని, ఇతర ప్రదేశాల్లో ఉన్నవారు అక్కడ సంతృప్తికర సౌకర్యాలు పొందుతుంటే అక్కడ నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
It is clarified that order regarding movement of persons amid lockdown is not extended to those categories of persons who're otherwise residing normally at places other than native places for purposes of work etc.&those who wish to visit their native place in normal course: MHA pic.twitter.com/GY9Z2AVHt4
— ANI (@ANI) May 3, 2020

































