Chaitanya Master: జబర్దస్త్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన మహేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా కాస్తో కూస్తో గుర్తింపు పొందిన మహేష్.. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడు పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఇక ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి సినిమాలో కూడా కీలకపాత్రలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ తన సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
డాన్స్ మాస్టర్ చైతన్య మరణం గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో మహేష్ మాట్లాడుతూ..” తాను జబర్దస్త్ చేసే సమయంలో చైతన్యతో కలసి ఒకసారి ప్రయాణం చేశానని తెలిపాడు. అంతేకాకుండా ఒక స్కిట్ కోసం తనకు డాన్స్ కూడా నేర్పించాడని మహేష్ చెప్పుకొచ్చాడు. చైతన్య మంచి టాలెంటెడ్. అంత క్రేజ్ ఉన్న ఆయనే అలా చేసుకున్నాడు అంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి. ఎంత స్ట్రగుల్ అయ్యుంటే ఆయన అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడు” అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు.

Chaitanya Master: గుర్తింపు బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది…
మల్లెమాలవారు మనకి ఉన్న గుర్తింపును బట్టి రెమ్యూనరేషన్ ఇస్తారని మొదట్లో తనిఖీ కూడా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చే వారిని మహేష్ చెప్పకు వచ్చాడు. ఆ తర్వాత నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి రెమ్యూనరేషన్ ఇచ్చేవారని, అయితే వారి ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా మరీ అంత తక్కువ ఏమీ ఉండదని మహేష్ చెప్పుకొచ్చాడు.
































