Chaitnya master mother : నేను ఏడవలేదు అన్నారు.. నేను ఏడవను… పేకాట బెట్టింగ్ లో చనిపోయాడంటూ మాట్లాడారు… చైతన్య తల్లి ఆవేదన…!

0
763

Chaitnya master mother : డాన్స్ షోలో మాస్టర్ గా ఉంటూ ఎంతో ఫేమస్ అయిన నెల్లూరు కి చెందిన చావా చైతన్య మాస్టర్ ఆత్మహత్య చెసుకుని మరణించడం టీవీ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. ఆర్థిక కారణాలతోనే మరణిస్తున్నట్లు చైతన్య మాస్టర్ వీడియోలో క్లారిటీ గా చెప్పినా ఆయన సన్నిహితులు, స్టూడెంట్స్ మాత్రం ఆయన మరణానికి వేరే ఎవరో కారణం అంటూ చెప్పారు. ఆయన ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతారని అనుకోవడం లేదని చెబుతున్నారు. ఇక చైతన్య మాస్టర్ తల్లి కూడా అలాంటి అభిప్రాయాన్నే చెబుతున్నారు. భరించలేని ఆర్థిక ఇబ్బందులు తన కొడుకుకు లేవంటూ చెబుతున్నారు. ఇక పలు యూట్యూబ్ ఛానెల్స్ తన కొడుకు గురించి మాట్లాడుతున్న విషయాల మీద ఆమె మాట్లాడారు.

పేకాట వల్ల చనిపోయాడంటూ మాట్లాడారు…

చైతన్య మాస్టర్ మరణించాక ఆయన తల్లి పలు మీడియా ఛానెల్స్ తో ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే ఎక్కడా ఆమె కంటతడి పెట్టకపోవడంతో ఆ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో చర్చ పేరుతో రచ్చ చేసారు కొంతమంది. వాటి గురించి స్పందిస్తూ నా కొడుకు ఇంకా నా చుట్టు ఉన్నాడనే భావనలో బతుకుతున్నాను. ఏడ్చి వాడిని బాధపెట్టను. నాలో బాధ నాకు తెలుసు వాడి కోసం ఏమి చేయాలో అది కష్టపడి చేస్తాను, ఏడ్చి వాడి ఆత్మను బాధ పెట్టను అంటూ చెప్పారు. ఇక పేకాట బెట్టింగ్ లో ఓడిపోయి అదే హోటల్ లో మరణించాడు అంటూ చైతన్య మాస్టర్ మరణం గురించి మాట్లాడటం గురించి ఆయన తల్లి లక్ష్మి స్వరాజ్యం గారు ఆవేదన చెందారు.

వేరేవాళ్ళ తప్పును కూడా తన మీద వేసుకునే నా కొడుకు అప్పులు చేసి మరణించాడని అనడమే నాకు నచ్చలేదు. తనకు ఆర్థిక ఇబ్బందులు మరీ అంతగా ఏమి లేవు. ఇక తాను హోటల్ లో మరణించడం వల్ల హోటల్ బిజినెస్ పోయిందని అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ మాట్లాడారు. నా కొడుకు మరణించాలని అనుకున్నపుడు నాతో చెప్పి ఉంటే మా ఇంట్లోనే ఇద్దరం చనిపోయే వాళ్ళం హోటల్ కి నష్టం చేశాడంటూ మాట్లాడటం ఎంత వరకు సబబు. రోడ్డు మీద చనిపోవాల్సింది అంటూ మాట్లాడారు. అదీ కాక పేకాట ఆడి చనిపోయాడని మాట్లాడారు. అలా తెలియకుండా మాట్లాడొద్దు. అతను కూడా నా కొడుకు వంటి వాడే అలా మాట్లాడటం నచ్చలేదు అంటూ తెలిపారు.