Chandhu Gowda : త్రినయని సీరియల్ లో విశాల్ పాత్రతో బాగా పాపులర్ అయిన చందు గౌడ స్వస్థలం కర్ణాటక. కర్ణాటక బెంగళూరు నుండి వచ్చిన చందు తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త బైరప్ప. చందు తన చదువును బెంగళూరు లో పూర్తి చేసి ఆపై సాఫ్ట్ వేర్ గా పనిచేసారు. కొంత కాలానికి మోడలింగ్ రంగం వైపు అడుగులేసి కన్నడ సీరియల్ గృహ లక్ష్మి లో నటించారు. ఆ తరువాత లక్ష్మి బారమ్మా సీరియల్ లో నటించాడు. ఇక సినిమాల్లోను చందు గౌడ నటించారు. అట్టెంప్ట్ టు మర్డర్, సంకష్ట కార గణపతి, కృష్ణ గార్మెంట్స్ ఇక తాజాగా రాబర్ట్ అనే సినిమాలో నటించాడు.

భార్య సీమంతం…
చందు గౌడ తెలుగు ఇండస్ట్రీలోకి త్రినయని సీరియల్ ద్వారా అడుగుపెట్టారు. త్రినయని సీరియల్ లో విశాల్ పాత్రలో బాగా పాపులర్ అయిన చందు 2020 లో మోడల్ షాలిని ని వివాహం చేసుకున్నారు. చందు, షాలిని నాలుగేళ్లుగా ప్రేమించుకుని 2020 లో ఒక్కటయ్యారు.

ఇపుడు షాలినికి సీమంతం చాలా ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా చందు గౌడ షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం చందు గౌడ త్రినయని సీరియల్ తో పాటు కన్నడలో యాంకర్ గా ఒక ప్రోగ్రామ్ కూడా హోస్ట్ చేస్తున్నారు.
































