Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయిన తర్వాత హైదరాబాద్ కి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీలో రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు రావాల్సిన అంశాల గురించి కీలక అంశాల గురించి ప్రస్తావించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది.

ఇలా చంద్రబాబునాయుడు హైదరాబాద్ కి రావడంతో పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి భాగ్యనగరం మొత్తం పసుపు మయం చేశారు. ఇకపోతే హైదరాబాదులోనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తాజాగా ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ పార్టీ నాయకులతో కీలక నేతలతో మాట్లాడి పలు విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళతో సమానం అని తెలిపారు. తన విజయానికి టిడిపి శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం వస్తుందని ఈయన తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోయినా ఎంతో మంది నాయకులు వేరొక పార్టీలోకి వెళ్లారు కాని కార్యకర్తలు మాత్రం వెళ్లలేదని తెలిపారు.
టీడీపీకి పూర్వ వైభవం..
ఇకపోతే నాలెడ్జ్ ఎకానమీగా హైదరాబాదును తీర్చిదిద్దిన ఘనత టీడీపీదని తెలిపారు. మా పార్టీ తర్వాత వచ్చిన ఇతర పార్టీలు దానిని కొనసాగించాయి తప్ప చెడగొట్టలేదని ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని అభినందించాలని తెలిపారు .పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎంగా ఆ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నారంటూ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.





























