Chandra Babu: ఎన్నికల మరొక ఐదు రోజులలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాజకీయం మరింత వేడెక్కింది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ మేనిఫెస్టో వర్కౌట్ కాదని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎక్కడ మేనిఫెస్టో గురించి వివరించకుండా ల్యాండ్ టైటిలింగ్ విషయంపై ప్రసంగిస్తున్నారు.

ల్యాండ్ టైటలింగ్ చట్టం అమలులో లేకపోయినా భూ సంరక్షణ పథకం కింద జగన్మోహన్ రెడ్డి 100 సంవత్సరాల తర్వాత ఎవరి భూమి వారి సొంతం అనే విధంగా భూ వివాదం కోసం కోర్టుకు వెళ్లకుండా సర్వేలు చేయించి ఎవరి భూమిని వారికి అందజేశారు అయితే ఇది జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి పేదల భూములను కాజేయడానికి పథకం వేశారు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గురించి దుర్భాషలాడుతూ తనలో ఉన్నటువంటి అక్కసు మొత్తం బయటపెట్టారు. భూ హక్కు చట్టం తీసుకువచ్చే హక్కు మీ అమ్మ మొగుడు ఇచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా? లేదంటే మీ నాన్నమ్మ మొగుడు ఇచ్చాడా? అంటూ అసభ్యకరంగా మాట్లాడారు. ఇలా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిపై దుర్భాషలాడటంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి టీడీపీ మద్దతు..
నిజానికి ఈ చట్టానికి మద్దతు తెలిపిన చంద్రబాబు నాయుడు ఈ విషయం బయటపడటంతో దీని నుంచి ప్రజల దృష్టిని మరణించడానికి చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఈసీ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ప్రచార కార్యక్రమాలలో భాగంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడటం కాదని ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.





























