Character artist Jagadeeswari : తెలంగాణ శకుంతల గాటి తరువాత అలాంటి రోల్స్ లో ప్రేక్షకులు ఉహించుకోగల నటి జగదీశ్వరి గారు. నాటక రంగం నుండి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె పిల్ల జామిందార్, భీమిలి కబడ్డీ జట్టు, రంగస్థలం, పుష్ప తాజాగా దసరా అలా ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే తనకి ఇప్పటికీ మంచి బ్రేక్ రాలేదని, వస్తే అవకాశాలతో పాటు రెమ్యూనరేషన్ కూడా మారుతుందని చెప్పే జగదీశ్వరి గారు రీసెంట్ గా మరణించిన డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గారి గురించి మాట్లాడారు.

ఆయన భార్య ఆడదే కాదనిపించింది…
రాకేష్ మాస్టర్ లాక్ డౌన్ సమయంలో టచ్ లో ఉండేవాడని, నన్ను అక్క అని పిలిచేవాడంటూ చెప్పారు. నా కొడుకు పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పేవాడు. రాకేష్ మాస్టర్ కి ఉన్న ఒకే ఒక బలహీనత మందు అంతే తప్ప అతను చాలా మంచి వాడు. గత సంవత్సరం నుండి రాకేష్ మాస్టర్ నాశనం అయ్యాడు. మూడో భార్య అంటూ చెప్పుకునే ఆమె ఇంటర్వ్యూలను యూట్యూబ్ లో చూసా, లక్ష్మి అనే ఆమె అసలు ఆడదేనా అనిపించింది. నీవల్ల ఒకరు బాగుపడకపోయినా పర్వాలేదు కానీ ఒకరు నాశనం అవ్వకూడదు. అంత పెద్ద డాన్స్ మాస్టర్ తన జీవితంలో నీకు చోటిస్తే ఆయన జీవితాన్ని నాశనం చేసావ్ అంటూ ఫైర్ అయ్యారు జగదీశ్వరి.

ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ 19 ఏళ్లకే భర్త లారీ ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నాటక రంగంలో ఉన్న నేను వాటినే నమ్ముకున్నాను. ఆయన మరణించిన సమయంలో బాబు చిన్న పిల్లాడు, పాప కడుపులో ఉంది. ఇక వారిని చూసుకోడానికి మళ్ళీ నాటకాలను వేసేదాన్ని. ఆ సమయంలో ఒక లాయర్ నాకు పరిచయమై 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. కానీ నా జీవితం ఆ పెళ్లి వల్ల నాశనం అయింది. నువ్వునేను సినిమాలో శకుంతల అక్క చేసిన పాత్ర నేను చేయాల్సింది. కానీ నా భర్త వల్ల అది పోయింది. ఇక తన టార్చర్ వల్ల సూసైడ్ అట్టెంప్ట్ కూడా చేశాను అంటూ ఎమోషనల్ అయ్యారు జగదీశ్వరి.































