Jr NTR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టార్ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25వ తేదీన విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు గురించి వెల్లడించారు.

ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి RRR సినిమా చిత్ర బృందంతో చేసిన చిట్ చాట్ లో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇకపోతే చాలామంది రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య స్నేహ బంధం ఈ సినిమాతో మొదలైందని భావిస్తున్నారు. నిజానికి వీరిద్దరి మధ్య అనుబంధం ఎప్పటినుంచో ఉందని తారక్ బయటపెట్టారు.

రామ్ చరణ్, ప్రణతి పుట్టిన రోజులు వరుసగా వస్తాయని, చరణ్ తో కలిసి పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రాత్రి తనతో కలిసి కారులో వెళ్లి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటామని ఎప్పటి నుంచో మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని తారక్ ఈ సందర్భంగా వెల్లడించారు.
బిన్న మనస్తత్వాలు….
ఈ ఇంటర్వ్యూలో సందర్భంగా ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, రామ్ చరణ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. రామ్ చరణ్ తన భార్య ప్రణతి అంటే చాలా భయపడతారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ ఎన్టీఆర్ తెలియజేశారు.ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రణతి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చరణ్, తాను భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్లమన్నారు. ఇలాంటి వాళ్ల మధ్యే స్నేహం బలంగా ఉంటుందని చెప్పారు తారక్.































