Charecter artist Hema : తెలుగులో హీరోయిన్ స్నేహితురాలిగా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన హేమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. హేమ అసలు పేరు కృష్ణ వేణి, తనది రాజోలు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా బాగా వైరల్ అయిన హేమ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఆ మధ్య మా ఎన్నికల సమయంలో శివబాలాజీ తో గొడవ, కొరకడం వంటి విషయాలతో బాగా వైరల్ అయింది హేమ. ఇక హేమ ఎవరి గురించైనా ఏ మాత్రం జంకు లేకుండా ఫ్రాంక్ గా మాట్లాడేస్తుంది.

నా కూతురు నేను గంజి తాగుతాం…
నటి హేమ చిన్న వయసులోనే కెరీర్లో మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ప్రేమ పెళ్లి చేసేసుకున్నారు. కెమరామెన్ మీర్ గారి తమ్ముడైన సయ్యద్ అహమ్మద్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హేమ. ఇక మొదటి నుండి సింపుల్ గా బ్రతకడం అలవాటు అంటూ హేమ చెబుతున్నారు. బిర్యానీ తిన్న రోజులు ఉన్నాయి గంజి అన్నం తిన్న రోజులు ఉంటాయి. కేవలం అన్నం ఆవకాయ ఉంది బ్రతుకు అన్నా కూడా అలానే తిని బతికేస్తాను. పెద్దగా కంఫర్ట్స్ లేకపోయినా హ్యాపీగా బతికేస్తాను అంటూ హేమ చెప్పారు. నా కూతురు చిన్నప్పటి నుండి తనకు గంజి అన్నం అలవాటు చేశాను.

అలా ఇప్పటికీ మేమిద్దరం రాత్రి పూట గంజి అలాగే పెట్టుకుని అందులోకి అన్నం, ఉల్లిపాయ, మిరపకాయ వేసుకుని పొద్దున్నే తింటాం అప్పుడప్పుడు. ఇక డాక్టర్స్ కూడా గంజిలో కొల్లాజిన్ బాగుంటుంది వయసు పెరిగేటప్పుడు ముడతలు రాకుండా కొల్లాజిన్ ఉపయోగపడుతుందని చెప్పారు. అందుకే ఇప్పుడు వారంలో రెండు మూడు సార్లు సూప్ రైస్ అని పేరు పెట్టుకుని గంజి అన్నం తింటుంటాం అంటూ చెప్పారు. వేలకోట్ల ఆస్తులంటూ ఏమీ లేవని కేవలం నా కూతురుని సెటిల్ చేసేంత సంపాదించుకున్నాను, ఇప్పటికీ కష్టపడి పని చేసుకుంటున్నాను అంటూ చెప్పారు హేమ.