Charmi Kaur: చార్మికౌర్ పరిచయం అవసరం లేని పేరు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పి తెర వెనుక నిర్మాతగా మారి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్ అనే బ్యానర్స్ స్థాపించారు.

ఈ బ్యానర్ నుంచి పలు సినిమాలను నిర్మిస్తున్నటువంటి ఛార్మి తాజాగా లైజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఛార్మి, పూరిలకు ఈ సినిమా బెడిసి కొట్టిందని చెప్పాలి. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరి కనెక్ట్స్ మూత పడిపోతుందని,ఇక ఈ సినిమాకు కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పెట్టుబడి పెట్టారంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ఎన్నో రూమర్లు వచ్చాయి.
ఇక ఈ సినిమా నష్టాలతో పూరి జగన్నాథ్ ఏకంగా ముంబై వదిలి హైదరాబాద్ తిరిగి వస్తున్నారని ముంబైలో తన ఫ్లాట్ ఖాళీ చేస్తున్నారంటూ ఏవేవో వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈ రూమర్లపై స్పందించిన చార్మి రూమర్స్ రూమర్స్ రూమర్స్.. తమ పూరి కనెక్ట్స్(PC) గురించి వచ్చే ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమే RIP రూమర్స్ అంటూ పోస్ట్ చేశారు.

Charmi Kaur: ఆ వార్తలలో నిజం లేదు…
ఈ విధంగా చార్మి తమ గురించి వస్తున్నటువంటి వార్తలన్నీ పూర్తిగా ఆవాస్తవమని తిరిగి PC బ్యానర్ ప్రకటించిన సినిమాల పై దృష్టి పెట్టిందని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మరి తమ బ్యానర్ లో ప్రకటించినటువంటి జనగణమన సినిమా కూడా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. మరి చార్మి ఈ ట్వీట్ తో ఆ వార్తలకు కూడా చెక్ పెట్టి త్వరలోనే ఆ సినిమా షూటింగ్ కూడా తిరిగి ప్రారంభమవుతుందని చెప్పకనే చెప్పారని తెలుస్తోంది.






























