Chandra Babu Naidu: ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ఆఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు అయితే ఈయన ప్రమాణ స్వీకార సమయంలో తొలి సంతకం ఏ ఫైలు పై పెడతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈయన మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేస్తారని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం రోజు ఎలాంటి ఫైలు పై సంతకం చేయకపోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు..అయితే నేడు ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను కూడా తీసుకున్నారు తన భార్య భువనేశ్వరితో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఇలా బాధ్యతలు అందుకున్న వెంటనే ఈయన మొదటి సంతకం మెగా డీఎస్సీ పై చేశారు. ఇలా ఎన్నికల హామీలలో భాగంగా మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టిన బాబు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే ఫైల్ మీద చేశారు. అనంతరం 4000 రూపాయల పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనా ఫైళ్ళపై మొదటి ఐదు సంతకాలు చేశారు.
డీఎస్సీ పైనే తొలి సంతకం..
ఈ విధంగా మొదటి సంతకం మెగా డీఎస్సీ పై పెట్టడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎన్ని వేల పోస్టులు ఉన్నాయి ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు త్వరలోనే ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా తెలియజేయబోతున్నారని తెలుస్తోంది.





























