Chinmayi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటి సమంత. ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సింగర్ చిన్మయి సైతం బాగా ఫేమస్ అయ్యారు. సమంత నటనకు చిన్మయి వాయిస్ ఎంతో అద్భుతంగా సెట్ కావడంతో అనంతరం సమంత నటించిన చాలా సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పారు.

ఈ విధంగా సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఏర్పడింది. ఇలా స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ చిన్న చిన్న అకేషన్ లకు కలుసుకొని పెద్ద ఎత్తున సందడి చేసేవారు. అయితే గతంలో చిన్మయి మీటు ఉద్యమం చేపట్టిన సమయంలో సమంత తనకు మద్దతు నిలబడ్డారు అలాగే సమంత విషయంలో కూడా చిన్మయి తనకు మద్దతుగా నిలబడి ఒకరికొకరు సహాయంగా ఉన్నారు.
అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరూ పెద్దగా కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చాయా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై సింగర్ చిన్మయి స్పందించారు. బహుశా ఇకపై సమంతకు నా అవసరం ఉండకపోవచ్చు అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఎందుకంటే సమంత ప్రస్తుతం తన సినిమాలకు తాను తెలుగులో ఎంతో స్పష్టంగా డబ్బింగ్ చెప్పుకోగలుగుతున్నారు తద్వారా తన అవసరం సమంతకు లేదంటూ చిన్మయి వెల్లడించారు.

Chinmayi: అలాంటి ఫోటోల వల్ల ఎవరికి లాభం…
ఇకపోతే మేమిద్దరం కలిసి ఫోటోలు షేర్ చేయనంత మాత్రాన అలాగే బయట డిన్నర్లు, పార్టీలు చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోతేనే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనుకోవడం పొరపాటు.ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అయితే మా ఇద్దరి మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉందని ఎలాంటి మనస్పర్ధలు రాలేదంటూ క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఒకవేళ మేము కలుసుకోవాలనుకుంటే ఇంట్లోనే కలుసుకుంటామని ఈ సందర్భంగా చిన్మయి సమంతతో తనకున్న అనుబంధం గురించి బయట పెట్టారు.



























