Chiranjeevi:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలకు రాజకీయాలకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అనంతరం రాజకీయాలలోకి వస్తుంటారు. ఇలా నందమూరి తారకరామారావు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అనంతరం రాజకీయ నాయకుడిగా పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలలోనే అధికారంలోకి వచ్చారు.

ఈ విధంగా ఎన్టీఆర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అయితే ఈయన రాజకీయాలలో రాణించలేక తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కేంద్ర మంత్రిగా ఏడాదిన్నర కాలం పాటు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.
ఇకపోతే తాజాగా పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి చిరంజీవి రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ..తనకు రాజకీయాలు పడవని తెలిపారు. రాజకీయాలలో ఉంటే ఎంతో కటువుగా ప్రవర్తించాలి ఎన్నో మాటలు పడాలి అలాగే ఎందరినో ఎన్నో మాటలు అనాలి.

రాజకీయాలు మనకు పడవు…
ఇలాంటి రాజకీయాలకు పవన్ కళ్యాణ్ సరైన వాడు.. తను ఎవరినైనా అంటాడు… మాటలు పడతారు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ సీఎంగా చూస్తాం అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం గురించి, తాను సీఎం అయితే చూడాలని మనసులో కోరికను కూడా ఈ సందర్భంగా చిరంజీవి బయటపెట్టారు. ప్రస్తుతం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































