మెగాస్టార్ చిరంజీవి తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే “ఖైదీ నెంబర్ 150”, “సైరా నరసింహారెడ్డి” వంటి చిత్రాలలో నటించిన మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ చిత్రం అయిన “లూసిఫర్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు.

ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “వేదాళం” చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ మరో సూపర్ హిట్ రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం వినబడుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తూ ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించింది. అయితే ఈ చిత్రానికి “గాడ్ ఫాదర్” అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఈ సినిమా తరువాత మెగాస్టార్ తమిళంలో అజిత్ నటించినటువంటి “వేదాళం” సినిమా రీమేక్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిరంజీవి లేకుండా కొన్ని సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఇందులో హీరో చెల్లెలు పాత్ర ఎంతో కీలకమైనది కాగా చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరొక రీమేక్ చిత్రంలో చేయనున్నట్లు సమాచారం వినబడుతుంది. అజిత్ హీరోగా నటించినటువంటి ‘ఎన్నై అరిందాల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా “ఎంతవాడుగాని” అనే పేరుతో తెలుగులో డబ్ అయి విడుదలైన సంగతి తెలిసిందే.అయితే ఈ స్క్రిప్ట్ ను మెగాస్టార్ చిరంజీవికి అనుగుణంగా మార్చి మరోసారి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రబృందం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.



























