Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మూడో తరం వారసురాలు అడుగుపెట్టింది రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఈరోజు ఉదయం కుమార్తె జన్మించడంతో మెగా ఇంటిలోను అలాగే అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఇలా ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తనకు మనవరాలు జన్మించింది అనే విషయం తెలియడంతో చిరంజీవి అపోలో హాస్పిటల్ కి చేరుకునే తన మనవరాలను చూశారు అనంతరం మీడియా సమావేశంలో ఈయన మాట్లాడుతూ తన మనవరాలు జాతకం గురించి తెలియజేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మాకెంతో ఇష్టమైనటువంటి మంగళవారం పాప పుట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
పాప మంగళవారం ఉదయం 1:49 గంటలకు పుట్టింది.ఎంతో అద్భుతమైన గడియలలో పాప జన్మించిందని తన జాతకం అద్భుతంగా ఉందని చిరంజీవి తెలిపారు.అయితే పాప జాతక ప్రభావం మా ఇంటి పై ఇప్పటికే ఉందని అందుకే ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని ఎంతో ఎత్తుకు ఎదిగారని చిరంజీవి తెలిపారు. అదేవిధంగా వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగడం కూడా శుభ పరిణామం అంటూ తెలిపారు.

Chiranjeevi: పాప జాతకం అద్భుతంగా ఉంది…
ఇలా తన మనవరాలు జాతకం ఎంతో అద్భుతంగా ఉంది అంటూ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా పాప జన్మించిందని విషయం తెలిసి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం శుభవార్తను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Welcome Little Mega Princess !! ❤️❤️❤️
You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! ????????— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023





























