Chiranjeevi -Balakrishna: చిరంజీవి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరూ అగ్ర హీరోలే. ఇద్దరు సినిమాలు ఎన్నోసార్లు బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే మరోసారి ఈ ఇద్దరు హీరోలు తలపడపోతున్నట్లు సమాచారం.ఇకపోతే బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు హీరోలతో మైత్రి మూవీ మేకర్స్ ఒకే తరహా బడ్జెట్ కేటాయించి సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో విడుదల విషయంలో మైత్రి మూవీ మేకర్స్ వారికి పెద్ద తలనొప్పిగా మారింది.

బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వీర సింహారెడ్డి సినిమాను నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. అదే విధంగా చిరంజీవితో వాల్తేరు వీరయ్య నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఇద్దరు హీరోలకు భారీ బడ్జెట్ కేటాయించి సినిమాలను చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విడుదల విషయంలో మైత్రి మూవీ మేకర్స్ అయోమయంలో పడ్డారు.
ఓకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు రావడంతో బయ్యర్లు కేవలం ఒక్క సినిమాకు మాత్రమే అడ్వాన్స్ ఇస్తామని ఇంకో సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకోవాలి అంటూ సూచిస్తున్నారు.మరో నెల రోజులలో బాలయ్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే సంక్రాంతికి ప్రభాస్ ఆది పురుష్, దిల్ రాజు వారసుడు సినిమాలో రాబోతున్నాయి. ఈ రెండు పెద్ద సినిమాలు కనుక థియేటర్ల సమస్య కచ్చితంగా ఏర్పడుతుంది.

Chiranjeevi -Balakrishna: సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా కష్టమేనా…
ఈ క్రమంలోనే బాలయ్య సినిమాని 2023 వేసవి సెలవులకు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు.ఇలా ఈ రెండు సినిమాలను ప్రకటించిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు సినిమాలో విడుదల విషయంలో అయోమయంలో పడ్డారని, ఈ సినిమాలు వీరికి తలనొప్పిగా మారాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు హీరోలలో ఎవరో ఒకరి సినిమా వెనక్కు తగ్గాల్సిందేనని అర్థమవుతుంది. మరి వెనకడుగు ఎవరు వేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

































