Chiranjeevi -Balakrishna: చిరంజీవి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమల వీరిద్దరూ అగ్ర హీరోలు మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరోలు.ఇలా వీరిద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఎన్నోసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు విడుదల చేస్తూ పోటీపడ్డారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాదిలో మరోసారి ఈ ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండబోతుంది.

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.సాధారణంగా వీరి ఒక్కరి సినిమా విడుదలయితేనే హంగామా భారీగా ఉంటుంది అలాంటిది ఇద్దరు హీరోల సినిమా ఒకేసారి విడుదలవుతుందంటే థియేటర్లో దద్దరిల్లి పోవాల్సిందే.
ఇలా ఇద్దరు హీరోలు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది.అయితే గతంలో కూడా కోదండరామిరెడ్డి రాఘవేంద్రరావు వంటి లిజెండరీ డైరెక్టర్లు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయడానికి ఆసక్తి చూపినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

Chiranjeevi -Balakrishna: అది పాన్ వరల్డ్ అవుతుంది…
ఇకపోతే తాజాగా అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా నిర్మాతలు అయినటువంటి అల్లు అరవింద్ సురేష్ బాబు వంటి వారు హాజరయ్యారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ మన కాంబినేషన్లో సినిమా ఎప్పుడు అని ప్రశ్నించారు. దీంతో అల్లు అరవింద్ మీరు నేను చిరంజీవి ముగ్గురు కాంబినేషన్లో మల్టీ స్టార్స్ సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్పగా అప్పుడు అది పాన్ వరల్డ్ అవుతుంది అంటూ బాలయ్య సమాధానం చెప్పారు. ఈ విధంగా చిరు బాలకృష్ణ మల్టీ స్టార్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇలా చెప్పకనే చెప్పారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.





























