Chiranjeevi: చిరంజీవి అభిమానిగా చిన్నప్పుడు చిరంజీవి సినిమాలను చూస్తూ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నాచురల్ స్టార్ నాని. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇక నాని హీరోగా మాత్రమే కాదు ఎంతోమంది కొత్తవారిని ప్రోత్సహిస్తూ సినిమాలు చేసే నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నాని తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించారు. తన దసరా సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సమర్పణలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ఈ కొత్త సినిమా ప్రకటనను అధికారకంగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఈ పోస్టర్లో మెగాస్టార్ చిరంజీవి చేయి మొత్తం రక్తపు మరకలతో ఆయన చేతి వెంట రక్తం కారుతూ ఉన్నట్టు కనిపించింది. ఈ పోస్టర్ చూస్తేనే ఈ సినిమా యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ..అతను తన ప్రశాంతతను వైలెన్స్ లో వెతుక్కుంటాడు అని కొటేషన్ రాసారు.

Chiranjeevi: టికెట్ల కోసం క్యూలో..
ఇక ఈ సినిమా గురించి నాని కూడా స్పందిస్తూ…నేను ఆయన్ని చూస్తూ పెరిగాను. అయన సినిమా టికెట్స్ కోసం లైన్లో నిల్చున్నాను. ఆయన కోసం నా సైకిల్ పోగొట్టుకున్నాను. ఆయన్ని సెలబ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఇది అంతా ఒక సర్కిల్ లాంటిది. మనందరం ఎదురుచూస్తున్న మెగాస్టార్ మ్యాడ్ నెస్ రాబోతుంది. ఈ సినిమా గురించి కలగన్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుత మీ పోస్ట్ వైరల్ అవడంతో నాని అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



























