Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవటంతో చిరంజీవికి మెగాస్టార్ అనే పేరు వచ్చింది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న చిరంజీవి రాజకీయ పార్టీని స్థాపించడం వల్ల కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. రాజకీయాలు తనకి వర్క్ అవుట్ అవ్వని గ్రహించి మళ్లీ హీరోగా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరోకి సంబంధించిన సినిమా కార్యక్రమాలకు వేరే హీరోలు అతిధులుగా వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా ఇటీవల ఎన్నో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే చిరంజీవి హాజరైన ఆ సినిమాలు అన్ని అనుకోకుండా ఫ్లాప్ అయ్యాయి. దీంతో చిరంజీవిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు గెస్ట్ గా వెళ్లారు. ఎందుకంటే ఈ సినిమాని నిర్మించిన నిరంజన్ రెడ్డి తాను నటించిన ఆచార్య సినిమాకి కూడా నిర్మాతగా ఉండటంవల్ల చిరంజీవి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యాడు.
అయితే తాప్సీ నటించిన ఆ సినిమా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా చిరంజీవి అతిథిగా హాజరయ్యాడు. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాకి తెలుగులో సమర్పకులుగా చిరంజీవి వ్యవహరించారు. ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. ఇక ఇటీవల ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవి సందడి చేశాడు. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.

Chiranjeevi: వాయిస్ ఓవర్ ఇస్తేనే ఫ్లాప్ అవుతుందా…..
ఇలా ఈ సంవత్సరంలో చిరు అతిథిగా హాజరైన సినిమాలు అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో చిరంజీవిని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి కూడా చిరు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అందువల్ల ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందని సోషల్ మీడియాలో కొందరు నేటిజన్స్ చిరంజీవిని ట్రోల్ మరి కొందరు మాత్రం సినిమాలో కంటెంట్ ఉంటే కచ్చితంగా హిట్ కానీ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వటం వల్ల ప్లాప్ అవుతుందని లేదు అంటూ చిరుని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


























