Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.ఈ క్రమంలోనే హైకోర్టు చిరంజీవికి ఆదేశాలను జారీ చేస్తూ జూబ్లీహిల్స్ లోని హౌసింగ్ సొసైటీలో వివాదాస్పదమైన స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దు అంటూ చిరంజీవికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వివాదాస్పద స్థలంలో యధాతత స్థితి కొనసాగించాలని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ప్రజల అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి కేటాయించిన 595 గజాల స్థలాన్ని సొసైటీ చిరంజీవికి విక్రయించిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై జై శ్రీకాంత్ బాబు తదితరులు కోర్టులో పిటిషన్ వేశారు.

కట్టడాలు నిలిపివేయాలి…
ఈ పిటిషన్ పై మంగళవారం విచారం జరిపిన న్యాయస్థానం తన తీర్పును ప్రకటించారు. ఈ స్థలాన్ని జిహెచ్ఎంసి స్వాధీనం చేసుకోకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా ఈ స్థలాన్ని విక్రయించారని, అందులో చిరంజీవి నిర్మాణ పనులు ప్రారంభించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం నిర్మాణాలు ఆపివేయాలనీ చిరంజీవికి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జిహెచ్ఎంసి ని కూడా ఆదేశిస్తూ విచారణ ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేసింది.


























