Chiranjeevi: సాధారణంగా ప్రజలు కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్లు మరీ ఎక్కువ. ఒక సినిమా ప్రారంభించాలంటే ఫలానా తేదీ మాత్రమే కొబ్బరికాయ కొట్టాలి, ఫలానా తేదీ మాత్రమే విడుదల చేయాలి అని సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాకుండా సినిమా టైటిల్ పెట్టటానికి కూడా ఫలానా అక్షరంతో మొదలయ్యే టైటిల్ పెడితేనే సినిమా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్లు కూడా ఫాలో అవుతూ ఉన్నారు.

ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక సెంటిమెంట్ ఇప్పుడు చర్చ జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాకు సంబంధించిన సెంటిమెంట్ గురించి ఇప్పుడు చర్చి జరుగుతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో చిరంజీవి డ్రైవర్ లాగా యూనిఫామ్ ధరించి చేతిలో టీ గ్లాస్ పట్టుకొని ఉన్నాడు. అయితే చిరంజీవిని ఇలా డ్రైవర్ గా చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా డ్రైవర్ గా చూసి అభిమానులు ఆనంద పడటం ఏమిటి అని ఆలోచిస్తున్నారా..

Chiranjeevi: టాక్సీ డ్రైవర్ గా చిరంజీవి…
అవునండి చిరంజీవిని డ్రైవర్ గా చూసి అభిమానులు ఆనంద పడుతున్నారు. ఎందుకంటే చిరంజీవి అభిమానులకి ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పటివరకు చిరంజీవి డ్రైవర్ గా నటించిన ఇంద్ర, గ్యాంగ్ లీడర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో చిరంజీవి డ్రైవర్ గా నటించిన సినిమాలు హిట్ అవుతాయన్న సెంటిమెంట్ ప్రేక్షకులలో ఉండిపోయింది.
ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర సినిమాలో కూడా డ్రైవర్ గా నటిస్తున్నాడని తెలియడంతో చిరు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అకౌంట్ లో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ఉండబోతోంది అంటూ సంబర పడుతున్నారు.































