God Father: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ నటిస్తున్నటువంటి గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.ఇందులో మెగాస్టార్ చిరంజీవి లుక్ అదిరిపోయేలా ఉండడంతో మెగా అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా మెగాస్టార్ లుక్ ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెగాస్టార్ కాస్త నెరసన జుట్టుతో, పక్కకు చూస్తూన్న, కుర్చీలో ఎంతో దర్జాగా కూర్చున్న తీరు వాహ్ అనిపిస్తుంది.ఇక ఈ సినిమా నుంచి మెగాస్టార్ లుక్ విడుదల చేస్తున్న అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతోంది. ఇలా సరికొత్త లుక్ లో ఉన్నటువంటి మెగాస్టార్ పోస్టర్ ఫ్యాన్స్ కి గూమ్స్ బంప్ తెచ్చేలా ఉంది.

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ చిత్రం లూసిఫర్ సినిమాకు రీమేక్ చిత్రంగా తెరకెక్కుతోంది. సత్యదేవ్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నారు.ఇక ఈ సినిమాలో నటిస్తున్నటువంటి సత్యదేవ్ పుట్టినరోజు నేడు కావడంతో ఆయనతోపాటు మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
దసరా కానుకగా విడుదల కానున్న గాడ్ ఫాదర్…
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఆచార్య సినిమాతో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో అయినా హిట్ కొట్టి ప్రేక్షకులను సందడి చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా మెగాస్టార్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సిందే.
THE #GodFather has arrived !! #GodFatherFirstLook : https://t.co/PYxtK9MCE5@KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @AlwaysRamCharan @ProducerNVP @SuperGoodFilms_ @KonidelaPro @saregamasouth pic.twitter.com/DQulIAsMWX
— Ram Charan (@AlwaysRamCharan) July 4, 2022































