Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వార్తలలో నిలిచారు. ఈమె తన మొదటి మాజీ భర్త శిరీష్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.

ఇలా శిరీష్ మరణించడంతో గతంలో శ్రీజ తన పెళ్లికి సంబంధించిన ఎన్నో రకాల వార్తలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీజ ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ చేసిన కామెంట్లకు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా చిరంజీవి తన బిడ్డ క్షేమం కోరుతూ కామెంట్స్ చేయడం గమనార్హం.
చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో కుమార్తె ఇలా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా తన ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉంది అంటూ కామెంట్లు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే చిరంజీవి మాత్రం తన కూతురు పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ మేము ఎప్పుడూ కూడా మా పిల్లల ఇష్టాలకు విలువనిచ్చే వాళ్ళం. ఇక మేజర్ అయిన శ్రీజ సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడంతో షాక్ అయ్యాము.
సంతోషంగా ఉండాలి..
వాస్తవంగా ఆలోచిస్తే శ్రీజ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఆమె ఎక్కడున్నా తన సంతోషాలే మాకు ముఖ్యమని తెలిపారు. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే కోరుకుంటున్నాము అమ్మ శ్రీజ నువ్వెక్కడున్నా చాలా సంతోషంగా ఉండాలి. నీ సంతోషమే మా సంతోషం ఈ ఘటన వల్ల నిరుత్సాహం వ్యక్తం చేసిన అభిమానుల ఆశీస్సులు నా బిడ్డకు శ్రీరామ రక్షగా నిలవాలి అంటూ ఈయన ఎంతో ఉన్నతంగా మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.



























