Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు దేవుడు ఇలా కొలుస్తారు. అయితే అలాంటి చిరంజీవిని ప్రస్తుతం ఆయన అభిమానులే ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ఇండస్ట్రీలో నటిగా రాణించలేకపోయిన కూడా వివాహాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తోంది.

శ్రీజ మొదట ఒక వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనితో మనస్పర్ధలు రావడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆ తరువాత రెండవసారి తల్లి తండ్రులు చూపించిన అబ్బాయిని వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు రెండవ భర్తకు కూడా దూరంగా ఉంటూ తన పిల్లలతో కలిసి తల్లితండ్రుల వద్ద ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలా శ్రీజ విడాకుల వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో శ్రీజ మూడో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతలు నిర్వహిస్తూ ఇండస్ట్రీలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా కూడా అండగా నిలిచి చిరంజీవి సొంత కూతురు విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు..ఈ వార్తలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. శ్రీజ గురించి ఎన్ని వార్తలు వస్తున్నా చిరంజీవి పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్న తరుణంలో చిరంజీవి వాటి గురించి స్పందిస్తూ….

Chiranjeevi: నిన్ను కంట్రోల్ చేసే వారికి దూరంగా ఉండు…
తన తల్లి చెప్పిన ఒక సలహా వల్ల ఇలాంటి వార్తలు గురించి బెంగ తగ్గిందని తెలిపాడు. శ్రీజ భవిష్యత్తు గురించి చిరంజీవి దిగులు పడటంతో..” నిన్ను కంట్రోల్ చేసి బాధపెట్టే వాళ్లకు నువ్వు దూరంగా ఉండు.. నీ మనసుకు ఏది మంచిగా అనిపిస్తే అది నువ్వు చెయ్యి” అని తన తల్లి ఇచ్చిన సలహా వల్ల ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నానని చిరంజీవి తెలిపాడు. ఇక ఈ మాటలపై మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కూతురి విషయంలో సరైన నిర్ణయం తీసుకోమని సలహా ఇస్తున్నారు.