Indra Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా, నటులుగా పరుచూరి బ్రదర్స్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఎన్నో అద్భుతమైన డైలాగులను సినిమా కథలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత వీరికి ఉంది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ని కృష్ణ సిద్ధం చేసిన ఈ కథను బి.గోపాల్ వినిపించగా వీరిద్దరు సినిమా చేయటానికి ఒప్పుకోలేదు.అనంతరం చిన్నికృష్ణ ఫ్లాష్ బ్యాక్ కొన్ని మార్పులు చేయడంతో బి.గోపాల్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అశ్వినీదత్ ఒప్పుకోలేదు. ఇకపోతే ఈ సినిమాని చిరంజీవి గారికి వినిపించడంతో తాను ఈ సినిమా చేస్తానని అయితే కొన్ని యాక్షన్ డైలాగ్స్ తగ్గించి రాయాలని సూచించారు.

చిరంజీవి చెప్పిన విధంగానే యాక్షన్ డైలాగ్స్ తగ్గించి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాము. అయితే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి చేసుకున్న తర్వాత చిరంజీవి మాట్లాడుతూ 80 శాతం షూటింగ్ పూర్తయింది ఇక ఇరవై శాతం షూటింగ్ లో మీ ఇష్టం వచ్చిన డైలాగ్స్ రాయండి అని చెప్పారు. ఆయన అలా చెప్పేసరికి మొక్కే కదా అని పీకేస్తే నీ పీక కోస్తా… రాననుకున్నావా రాలేననుకున్నావా అనే డైలాగ్స్ రాసి మెగాస్టార్ గారికి వినిపించాను.
సెల్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు…
ఈ డైలాగ్స్ విన్న ఆయన అశ్విని దత్ ను పిలిపించి ఆయనకు ఒక ఖరీదైన సెల్ ఫోన్ చూపించి ఒక గంటలో ఇలాంటి ఫోన్ పరుచూరి గారి చేతిలో ఉండాలి అని తనకు బహుమానంగా ఇచ్చారని గోపాలకృష్ణ తెలిపారు. ఇక ఈ సినిమా వేడుకల్లో భాగంగా అభిమానులు ఎప్పుడో చిరంజీవి గారిని వేదికపై ఒక స్టెప్ వేయాలని అడిగేవారు అలాంటిది ఈ సినిమా వేడుకలో డైలాగ్ చెప్పాలని అడిగారు. అంతగా ఇంద్ర సినిమాలో డైలాగులు ఫేమస్ అయ్యాయని ఈ సినిమా గురించి గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

































