Chiranjeevi: సినీ నటుడు చిరంజీవి తన తమ్ముడు నాగబాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. సాధారణంగా తన తమ్ముళ్లపై ఎంతో ప్రేమ కురిపించే చిరంజీవి ఇలా నాగబాబును తిట్టడం వెనుక కారణం లేకపోలేదని తెలుస్తుంది. ఇటీవల ఎన్నికలు పూర్తయిన తర్వాత నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ అందుకు కారణమని చెప్పాలి.

సోషల్ మీడియా వేదికగా నాగబాబు మావాడైన పరాయి వాడికి సపోర్ట్ చేస్తే తను పరాయి వాడే పరాయి వాడు మా పక్క నిలబడితే మా వాడే అంటూ ఈయన చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. అయితే ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించే చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వార్త వైరల్ అవ్వడమే కాకుండా నాగబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ఇలా పరోక్షంగా నాగబాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారంటూ చాలామంది మెగా ఫ్యామిలీ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య పోరు మొదలవుతూ ఉన్న నేపథ్యంలో చిరంజీవి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చారట ఇలా మన కుటుంబ సభ్యులకు గురించి మనమే సోషల్ మీడియాలో మాట్లాడుతూ పరువు పోగొట్టుకోవడం అవసరమా అని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మొదలైన ఫ్యాన్స్ వార్..
అయితే గత కొంతకాలంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య సరైన సఖ్యత లేదని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులతో అది నిజమేనని, కానీ మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు అర్జున్ లేరు అని అభిమానుల వ్యాఖ్యలను బన్నీ ఫాన్స్ తిప్పి కొడుతున్నారు. ఇలా రెండు కుటుంబాల అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ కూడా మొదలైందని చెప్పాలి.





























