Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. గత ఏడాది చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి13వ తేదీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
తన కొడుకు కోడలు తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయాన్ని తలుచుకొని ఈయన ఎమోషనల్ అయ్యారు. ఉపాసన రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం చెప్పగానే నాకు సురేఖకు ఎంతో సంతోషం వేసింది. ఆ సంతోషంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించారు.

Chiranjeevi: ఆరు సంవత్సరాలుగా శుభవార్త కోసం ఎదురుచూసాం…
రామ్ చరణ్ ఉపాసన జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన అనంతరం ఈ శుభవార్తను మాకు తెలియజేశారు. ఆ సమయంలో తమకు చాలా సంతోషం వేసిందని గత ఆరు సంవత్సరాల నుంచి ఈ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నామని ఈయన తెలిపారు. అయితే ఉపాసనకు మూడు నెలలు పూర్తి అయిన తర్వాతనే ఈ శుభవార్తను అందరితో పంచుకున్నామని ఈ సందర్భంగా చిరంజీవి ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


































