Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన చిరంజీవి కొంతకాలం రాజకీయాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలలో పాల్గొన్న చిరంజీవి తన సొంతంగా స్థాపించిన తన పార్టీని ఇతర రాజకీయ పార్టీలలో విలీనం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 అని బ్లాక్ బస్టర్ సినిమాని ప్రేక్షకులకు అందించాడు.

ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇదిలా ఉండగా చిరంజీవి చిన్నప్పుడే ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ వెల్లడించారు.చిరంజీవి సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సినిమా నిర్మాణ పనులు కూడా చేపట్టారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా అనే సినిమాని తెలుగులో సమర్పిస్తున్నాడు.

ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అమీర్ ఖాన్, నాగచైతన్య, చిరంజీవితో కలిసి నాగార్జున ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఈ ఇంటర్వ్యూ ని ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేశాడు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ..లాల్ సింగ్ చడ్డా లో అమీర్ ఖాన్ ఒక చిన్న పిల్లాడిలా, కాలేజ్ స్టూడంట్‌లా, ఆర్మీ ఆఫీసర్‌లా కనిపిస్తారు. ఈ టాన్స్ఫర్మేషన్ ఎలా సాధ్యమైంది’ అని అడగ్గ…వీఎఫ్‌ఎక్స్ వాళ్ళే దానికి కారణం చెప్పాడు. వెంటనే చిరంజీవి కల్పించుకొని దీన్ని ఎడిటింగ్ లో తీసేయండి అనగానే వారు ఒక్కసారిగ నవ్వారు.
Chiranjeevi: ఏడో తరగతిలో ప్రేమలో పడ్డాను..
ఇక అమీర్ ఖాన్ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడుతూ మీకు కూడా చిన్నప్పుడు ఏవైనా లవ్ స్టోరీలు ఉన్నాయా అని అడగ్గా… నేను పదేళ్ల వయసులో ఏడో తరగతి చదువుతున్న సమయంలో ఒక అమ్మాయి నాకు సైకిల్ నేర్పించేది. అయితే నేను సైకిల్ తొక్కకుండా ఆ అమ్మాయిని చూస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నా దృష్టి అంతా సైకిల్ తొక్కడం మీద కాకుండా ఆ అమ్మాయి మీద ఉండేది. అప్పుడు ఆమె ముందుకు చూడు అంటూ నా మొహాన్ని తిప్పేది. సాధారణంగా ఆ రోజుల్లో మొగల్తూరులో ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం చాలా పెద్ద విశేషం. అయితే ఒక అమ్మాయి వద్ద నేను సైకిల్ నేర్పించుకోవడం కూడా అక్కడ అందరికి పెద్ద విద్య. ఇలా తన చిన్ననాటి ప్రేమ గురించి చిరంజీవి అందరి ముందు ఓపెన్ అయ్యాడు































