Chiranjeevi:తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు. ఇలా ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చిన వెంటనే పరిష్కరిస్తూ ఉండడమే కాకుండా సినీ కార్మికులకు అండగా నిలబడుతూ తనవంతు సహాయం చేస్తుంటారు.ఇకపోతే ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వారిని ఆదుకోవడంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.

ఈ విధంగా ఇండస్ట్రీలోనూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఈయన ఈ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి ప్రాణదాతగా మారిపోయారు. ఇక చిరంజీవి స్థాపించినటువంటి బ్లడ్ బ్యాంక్ ఎంతో విజయవంతంగా ముందుకు నడుస్తోంది.అయితే ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? అసలు దీని వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయానికి వస్తే…
చిరంజీవి ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలో అందరిలాగే తాను కూడా పెద్దపెద్ద బంగ్లాలు ఖరీదైన కార్లు కొనుక్కోవాలని అనుకున్నారట. భగవంతుడి దయవల్ల తనకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చి తన అనుకున్నవన్నీ వచ్చినప్పటికీ తనలో ఏదో తెలియని అసంతృప్తి నెలకొంది. నాకు ఇంత ఇచ్చిన అభిమానులకు నేనేం తిరిగి ఇవ్వగలను అని ఆలోచిస్తున్న సమయంలోనే తనకు ఈ బ్లడ్ బ్యాంక్ ఆలోచన వచ్చిందని ఈయన వెల్లడించారు.

Chiranjeevi: హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం…
ఇలా సరైన సమయానికి బ్లడ్ దొరకక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈయన బ్లడ్ బ్యాంక్ స్థాపించారని, బ్లడ్ బ్యాంక్ స్థాపించడం వెనుక ఇంతకథ నడిచిందని వెల్లడించారు. బ్లడ్ బ్యాంక్ తో పాటు ఐ బ్యాంకు కూడా స్థాపించారు. అలాగే ప్రస్తుతం చిత్రపురిలో ఈయన సినీ కార్మికుల కోసం తన తండ్రి పేరుతో హాస్పిటల్ నిర్మాణానికి కూడా ఈయన శ్రీకారం చుట్టిన విషయం మనకు తెలిసిందే.

































