Chiranjeevi: ఎవరి సహాయం లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా అగ్రస్థానాన్ని చేరుకున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా గుర్తింపు పొందాడు.

ఇదిలా ఉండగా ఈ రోజు మదర్స్ డే సందర్భంగా చిరంజీవి తన తల్లితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మదర్స్ డే సందర్భంగా తన తల్లి,తోడబుట్టిన వారితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన చిరంజీవి అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పాడు.
ఈ క్రమంలో..” అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ …అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మ ని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ” అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. చిరంజీవి షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. చిరంజీవితోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా మదర్స్ డే సందర్భంగా వారి మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Chiranjeevi: నిరాడంబరంగా ఉండటం అమ్మను చూసి నేర్చుకున్నా…
ఇదిలా ఉండగా చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న చిరంజీవి ప్రస్తుతము భోళా శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మరొక సినిమా గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ … అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం
అమ్మ ని చూసే నేర్చుకున్నాం.
అమ్మలందరికి #HappyMothersDay🙏💐 pic.twitter.com/6Xm4l1R14d— Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2023