Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు చిరంజీవి ఒకరు. హీరోగా మాత్రమే కాకుండా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అయితే ఈ పార్టీ స్థాపించిన తర్వాత చిరంజీవి అనుకున్న స్థాయిలో రాజకీయాలలో సక్సెస్ కాకపోవడంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు.

ఇలా రాజకీయాలలో కొనసాగిన చిరంజీవి తనకు రాజకీయాలు పడవని అందుకే సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను అంటూ ఈయన ఇండస్ట్రీలోకి తిరిగివచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి చిరంజీవి మనసు మళ్ళీ రాజకీయాల వైపు మళ్ళింది అని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. అలాగే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న తరుణంలో ఈయనకు రాజకీయాలపై మనసు మళ్లిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాజ్యసభలోకి మరోసారి చిరంజీవి అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. చిరంజీవిని తిరిగి రాజకీయాలలోకి తీసుకురావడం కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
రాజకీయాలలోకి చిరు..
ఆంధ్రా, తెలంగాణల్లో బీజేపీని పటిష్టం చేయడం కోసం బీజేపీ ఈ రాజకీయ ఎత్తుగడను వేసినట్లు సమాచారం. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇటీవల చిరంజీవి కలిశారు. ఇలా పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మంచి అనుబంధమున్న నేపథ్యంలో తన బాటలోనే తన అన్నయ్యను కూడా బిజెపికి అనుకూలంగా మార్చుకోవాలని ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం.





























