Balakrishna: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథ కొన్ని సందర్భాలలో వేరే హీరోలు చేయడం సర్వసాధారణం. సినిమా కథ నచ్చకపోవడం లేదంటే వారికి ఇతర సినిమా షూటింగులు ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాక కొన్ని సినిమా కథలను మిస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా మిస్ చేసుకున్న సినిమాలు కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాధపడిన వారు ఎంతో మంది ఉన్నారు.

అలాగే ఆ హీరోలు రిజెక్ట్ చేసిన కథ ఫ్లాప్ అవడంతో చేయకపోవడమే మంచిది అనుకున్న వాళ్లు కూడా ఉంటారు. ఇలా ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించాల్సిన సినిమా ఒకటి బాలయ్య వద్దకు వెళ్ళింది. భారతీయ రాజా కథ అందించిన చిత్రంతో కోడి రామకృష్ణ చిరంజీవి వద్దకు వెళ్లి కథ వినిపించారట. అయితే ఆ కథ పెద్దగా నచ్చకపోవడంతో చిరంజీవి రిజెక్ట్ చేశారు. అలా రిజెక్ట్ చేయడంతో ఆయన సరాసరి బాలయ్య వద్దకు వెళ్లాక బాలయ్య ఆ సినిమాను చేశారు..
ఈ విధంగా బాలకృష్ణ సుహాసిని హీరో హీరోయిన్లుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1884 సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మంగమ్మ గారి మనవడు. అప్పట్లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. బాలకృష్ణ సోలో హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో వంద రోజులు ఆడిన తొలి సినిమాగా తన కెరీర్లో నిలిచిపోయింది .అంతేకాకుండా ఈ సినిమా కర్ణాటకలో 100 రోజులు హైదరాబాదులో ఏకంగా 565 రోజులు ప్రదర్శితం అయ్యి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమాలో దంచవే మేనత్త కూతురా అనే పాట ఎవర్ గ్రీన్ సాంగ్ అని చెప్పాలి. ఇలా మ్యూజిక్ పరంగా, కథపరంగా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా 600 రోజులు ఆడడంతో చిరంజీవి ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు అప్పట్లో చాలా బాధపడ్డారు. అయితే ఈ సినిమా మిస్ అయినందుకు చిరంజీవి తదుపరి చాలెంజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.



























