తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ప్రజా అంకిత యాత్ర సమయంలో జరిగిన పలు విషయాల గురించి మాట్లాడుతూ మీడియాకు సున్నితంగా చురకలంటించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు ప్రజా అంకిత యాత్ర చేశారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన బస్సులో తిరిగారు. ఈ క్రమంలోనే చిరంజీవి అభిమానులతో పాటుగా ప్రజలను కలవడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే చిరంజీవికి ఎదురైనా పలు చేదు సంఘటనల గురించి గుర్తు చేసుకున్న చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాత్రలో భాగంగా ప్రజలతో కలిసిపోయి, కొంతమందిని ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ కూడా ఇచ్చానని తెలిపారు . అలా ఒక స్టేషన్ లో స్పీచ్ ముగిసిన తరువాత నెక్స్ట్ స్టేషన్ కి బస్సులో ఉన్నప్పుడు నాలుగు మీడియా చానల్స్ చిరంజీవిని తరచూ ఫాలో చేస్తున్నాయట.

అయితే ఆ మీడియా చానల్స్ చిరంజీవి పై ప్రేమతో కాకుండా పొరపాటు జరిగితే దాన్ని హైలైట్ చేసి చూపించాలి అన్న తపనతో చిరంజీవిని ఫాలో అవుతున్నారట. ఇక బస్సులో సీట్లో కూర్చున్న చిరుకి వాళ్ళ బాబాయ్ తినడానికి ఖర్జూరాలు ఇచ్చిన సమయంలో వాటిని తినడం కోసం చేతులు శుభ్రం చేసుకున్నాడట. దానిని వారు వీడియో తీసి చేతులు శుభ్రం చేసుకున్న వీడియో పక్కన పెట్టి అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వగానే చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటున్నట్టుగా వీడియోని ఎడిట్ చేశారట.
Paapam boss pic.twitter.com/4ITtrwuhqH
— Naresh (@andhroindian) December 5, 2021
చేతులు శుభ్రం చేసుకుంటున్న వీడియోని పదేపదే చూపిస్తూ చిరంజీవి ఫ్యాన్స్ అంటే అంత అంటరాని వాళ్ళు అయ్యారా?ప్రజల్ని తాకడమంటే ఆయనకు అంత అసహ్యమా? అంటూ చిరంజీవిని టార్గెట్ చేశారట. అందుకే ఇప్పుడుమైక్ పైన శానిటైజర్ చేద్దామన్నా భయం వేస్తుంది. మీడియా దీనిని ఎలా ప్రచారం చేస్తుందో చెప్పలేం.. అంటూ చిరంజీవి రాజకీయ ప్రస్థానంలో ఎదురైన చేదు అనుభవం గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.































